+9198490 56665   |     mgr.trs@gmail.com

దానంకు గుణపాఠం తప్పదు

బంజారాహిల్స్‌, జూన్‌ 27: బీఆర్‌ఎస్‌ టికెట్‌ మీద గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు గుణపాఠం నేర్పేందుకు ప్రజలంతా సిద్ధ్దంగా ఉన్నారని నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌ డివిజన్‌కు చెందిన పలువురు యువకులు శుక్రవారం మన్నె గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.